FREE CREDIT CARDS
మీరు ఉచితంగా క్రెడిట్ కార్డు పొందాలని భావిస్తున్నారా? అయితే ఎల్ఐసీ కార్డులు పొందొచ్చు దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఇప్పుడు యాక్సిస్ , ఐడీబీఐ బ్యాంకుల టైఅప్‌తో క్రెడిట్ కార్డులు అందిస్తోంది. యూజర్లకు ఇతర ప్రయోజనాలతో పాటు ఇన్సూరెన్స్ చెల్లించే వెసులుబాటు కల్పిస్తాయి ఈ కార్డులు. ఆ వివరాలు మీ కోసం.. ఎల్ఐసీ అందిస్తున్న క్రెడిట్ కార్డులు ప్రీమియం డిపాజిట్ చేసేందుకు దోహదపడటమే కాకుండా ఇతర చాలా ప్రయోజనాల్ని అందిస్తాయి. యాక్సిస్ బ్యాంకుతో టైఅప్‌తో ఎల్ఐసీ మూడు రకాల క్రెడిట్ కార్డులు అందిస్తోంది. అందులో ఎల్ఐసీ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ ప్లాటినం క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ టైటానియం క్రెడిట్ కార్డు. ఎల్ఐసీ క్రెడిట్ కార్డు వినియోగంతో కలిగే లాభాలేంటో చూద్దాం. ఎల్ఐసీ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు ఎల్ఐసీ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు మీరు చెల్లించే ప్రతి వంద రూపాయలు ప్రీమియం డిపాజిట్‌కు 2 రివార్డు పాయింట్లు అందిస్తుంది. అంతేకాకుండా మీరు ఖర్చు చేసే ప్రతి వంద రూపాయలకు 1 రివార్డు పాయింట్ లభిస్తుంది. ఈ కార్డు పోగొట్టుకుంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కాంప్లిమెంటరీగా అందుతుంది. వ్యక...